ఎలక్ట్రానిక్( Electronic ) రంగంలో టెక్నాలజీ అనేది దూసుకుపోతూ.అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం పోర్టబుల్ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో మినీ ఏసీల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే.పోర్టబుల్ ఏసీలు ఎంతో సౌకర్యంగా ఉండడంతో అందరూ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మార్కెట్లో పోర్టబుల్ ఫ్రిజ్లు అడుగుపెట్టాయి.మార్కెట్లో మినీ ఫోర్టబుల్ ఫ్రిజ్లు( Mini portable fridges ) చాలా వెరైటీలతో వచ్చేసాయి.
చాలామంది వేసవికాలంలో జర్నీ చేస్తున్నప్పుడు ఈ పోర్టబుల్ ఫ్రిజ్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.అమెజాన్లో ఈ మినీ ఫ్రిడ్జ్( Mini fridge ) లకు మంచి రేటింగ్స్ కూడా వస్తున్నాయి.
ఈ మినీ ఫ్రిడ్జ్ ఫీచర్స్ తెలిస్తే కొనుగోలు చేయకుండా ఉండలేరు.ఈ మినీ ఫ్రిడ్జ్ పేరు Nostalgia RF6RRAQ రిట్రో.
ఇందులో ఆరు కూల్ డ్రింక్స్ బాటిల్స్ సులభంగా పడతాయి.పోర్టబుల్ కావడంతో కారులో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
ఆఫీసులలో కూడా రిఫ్రిజిరేటర్ గా ఉపయోగించుకోవచ్చు.
ఈ మినీ ఫ్రిడ్జ్ ఎత్తు 10.43 అంగుళాలు, వెడల్పు 9.84 అంగుళాలు.ఈ ఫ్రిడ్జ్ ఆరు రకాల కలర్లలో అందుబాటులో ఉంది.ఇక 120 ఓల్టేజ్ పవర్ తో పనిచేస్తుంది.ఈ మినీ ఫ్రిడ్జ్ బరువు కేవలం రెండు కేజీలు కాబట్టి సులభంగా మోసుకెళ్ళొచ్చు.ఈ మినీ ఫ్రిడ్జ్ లో హీటింగ్ యూనిట్ తో పాటు కూలింగ్ యూనిట్ కూడా ఉంది.
రెండు రకాలుగా ఈ ఫ్రిజ్ ను ఉపయోగించుకోవచ్చు.థర్మో ఎలక్ట్రిక్ టెక్నాలజీతో 48 డిగ్రీల సెన్సెస్ వరకు హీట్ చేసుకునే ఆప్షన్, ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.అమెజాన్లో ఈ మినీ ఫ్రిడ్జ్ ధర రూ.4201 గా ఉంది.అయితే 30% తగ్గింపుతో రూ.2940 లో కొనుగోలు చేయవచ్చు.