షార్ట్ ఫిలింస్ చేసి హీరోగా మారిన రాజ్ తరుణ్( Raj Tarun ) లో బడ్జెట్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అనిపించేలా చేసుకున్నాడు.సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్ట్ దృష్టిలో పడి కుమారి 21f( Kumari 21f ) సినిమాలో ఛాన్స్ అందుకున్న అతను ఆ సినిమా హిట్ ని కెరీర్ కు అనుగుణంగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.
కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేసినా అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు.ఫైనల్ గా వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ కెరీర్ లాగిస్తున్నాడు రాజ్ తరుణ్.
అలాంటి రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమాకు మారుతి కథ అందిస్తున్నట్టు టాక్.గీతా సుబ్రహ్మణ్యం వెబ్ సీరీస్ చేసిన సాయి వర్ధన్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది.ఈ సినిమాకు మారుతి( Maruti ) కథ అందించడం వల్ల ప్రాజెక్ట్ పై క్రేజ్ వచ్చింది.మారుతి కథలు చాలా విచిత్రంగా ఉంటాయి.అందుకే రాజ్ తరుణ్ ఈసారి హిట్ ట్రాక్ ఎక్కుతాడని అంటున్నారు.ఏది ఏమైనా మారుతి కథ అంటే రాజ్ తరుణ్ కి లక్కీ డేట్స్ మొదలైనట్టే అని చెప్పొచ్చు.
ఈ సినిమా త్వరలో మొదలవుతుందని తెలుస్తుంది.సినిమాకు టైటిల్ గా కూడా వెరైటీగా పెడుతున్నారట.