భారతీయ రైల్వే( Indian Railways ) ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూ, కొత్త నిబంధనలను తీసుకువస్తూనే ఉంది.కాబట్టి రైళ్లలో ప్రయాణించే వారందరూ కచ్చితంగా రైల్వేలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం తప్పనిసరి.
భారత రైల్వే కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం ప్రయాణికుల సంరక్షణ, ప్రయాణికుల సౌకర్యం మాత్రమే.ప్రయాణాలలో పలు ఇబ్బందులు ఎదురుకాకుండా భారతదేశం అంతటా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది.
రాత్రి సమయాలలో ప్రయాణికులు ( Railway Passangers ) ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

కేవలం ప్రయాణికులకే కాకుండా రైలు అటెండర్లు, టీటీఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర ఉద్యోగులు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందే.
1).మద్యం సేవించడం, ధూమపానం, ఆసాంఘిక కార్యకలాపాలు లతోపాటు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే IRCTC నుంచి భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది.
2).రైలులో ప్రయాణికులు పెద్దపెద్ద శబ్దాలు చేయకూడదు.
సీట్లు, కంపార్ట్మెంట్ల విషయంలో కోచ్ లతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు.పాటలు బహిరంగంగా వినకుండా హెడ్ ఫోన్స్ లాంటివి వినియోగించాలి.

3).రాత్రి 10:00 దాటితే ప్రయాణికులు ఎవరు లైట్లు వేయకూడదు.
4).రాత్రి 10:00 దాటితే TTE టికెట్లు చూపించమని ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు.
5).కుటుంబ సమేతంగా వెళుతున్న ప్రయాణికులు రాత్రి 10:00 తర్వాత ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు.

6).రైలులో మిడిల్ బెర్త్ లో ప్రయాణించే వ్యక్తులు ఎప్పుడైనా తమ సీట్లు తెరచుకోవచ్చు.ఈ విషయంలో లోయర్ బెర్త్ ప్రయాణికులు వారి పట్ల ఎటువంటి ఫిర్యాదు చేయరాదు.
7).రాత్రి 10:00 తరువాత ఆన్లైన్ లో ఆహారం సప్లై చేయడం నిషేధం.అయితే ఇ-కేటరింగ్ సేవలతో మీ భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
8).ఏసీ కోచ్లలో ప్రయాణించే వ్యక్తికి 70 కిలోల వరకు మాత్రమే లగేజ్ తీసుకెళ్లే అనుమతి ఉంది.
అదే సీపర్ క్లాసులో అయితే 40 కిలోలు, సెకండ్ క్లాస్ లో అయితే 35 కిలోల వరకు లగేజ్ కు అనుమతి ఉంటుంది.అలా కాకుండా అదనపు చార్జీలు చెల్లిస్తే ఏసీల్లో 150 కిలోలు, స్లీపర్ లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ లో 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లే అనుమతి ఉంటుంది.