చిప్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

మనకు టైం పాస్ కానప్పుడు.ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది.

 Eating Too Much Popcorn And Chips Causes Health Problems, Health Issues, Masala,-TeluguStop.com

అలా అనిపించినప్పుడు మన చుట్టూ ఏలాంటి స్నాక్స్ ఉన్నాయ్? ఏం ఉన్నాయ్ అని వెతుకుతాం.ఇక పక్కన ఆలు చిప్స్, ఆనియన్ చిప్స్ కానీ పాప్ కార్న్ కానీ ఉన్నాయ్ అంటే ఆలోచించకుండా తినేస్తాం.

పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని తినడానికి ప్రతిఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు.సినిమా థియేటర్లకు వెళ్లిన సరే ఎక్కువ మంది చిప్స్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

మరికొందరైతే నిత్యం పాప్ కార్న్స్ తింటూ ఉంటారు.అయితే ఇలా ప్రతి నిత్యం తింటే ప్రమాదకరం అని అంటున్నారు కొందరు పరిశోధకులు.ఎందుకు? ఏంటి అనేది మనం ఇప్పడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

Telugu Cancer, Popcornchips, Effects, Tips, Masala, Potato Chips, Popcorn-Telugu

ఎంతో ఇష్టంగా పాప్ కార్న్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది.పాప్ కార్న్, చిప్స్ లో వేసే మసాలాలు, ఉప్పు వల్ల అధిక బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, అధిక రక్తపోటు పెరగడం వంటివి ఎక్కువగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.

సాధారణంగా అయితే వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కానీ ప్రస్తుత కాలంలో వాటి తయారీ విధానంలో మార్పులు చేయడం వల్ల వాటిలో వేసే మసాలాలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు.ఇక పాప్ కార్న్, చిప్స్ కానీ ప్యాకేజింగ్ కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube