ఈటీవి లో ప్రసారమయ్యే షో లల్లో జబర్దస్త్ ( Jabardasth )ఒకటి.ఈ షో గత 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పటికీ కూడా ఈ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.
దీని ద్వారా చాలా మంది కమెడియన్లు కు లైఫ్ వచ్చింది, దీని పుణ్యమాని వాళ్ళు సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు…ఇక కామెడీతోనే కాకుండా బుల్లితెరపై యాంకర్ గా రాణించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా పాల్గొని మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు.

కానీ షోలో అంచనాలకు భిన్నంగా ముందే బయటకు వచ్చేసిన అతడు.ఆ తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించాలేదు.తాజాగా చలాకీ చంటి ( Chalaki chanti )ఆరోగ్యానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.హటాత్తుగా వచ్చిన గుండెపోటుతో( Heart attack ) తీవ్ర అస్వస్థతకు గురైన చంటికి హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆఫీస్ లో చికిత్స చేయిస్తున్నారు .అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో చేర్చారు.

అయితే.చలాకీ చంటి తాజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే.చంటికి సన్నిహితులుగా ఉండే వారు అందిస్తున్న సమాచారాన్ని చూస్తే.
కొద్ది రోజుల క్రితం చంటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని.ఆ వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని చెబుతున్నారు.
తాజాగా ఈ నెల 21న మరోసారి గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు.

దీంతో అతడ్ని వెంటనే గచ్చిబౌలి కేర్ కు తీసుకెళ్లి జాయిన్ చేశారు.రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.దీంతో చంటికి సర్జరీ చేసి స్టంట్ వేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉందని.ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతానికి చంటి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు.అతడి తాజా ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ విడుదల చేసే ఛాన్స్ ఉంది…
.