వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై బారాసా ది సెల్ఫ్ గోలేనా?

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అనుకున్నప్పుడు ఉద్యమాన్ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లడం తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అవ్వటం తర్వాత కొన్ని నెలలపాటు నిశబ్దం గా ఉండటం ఇలా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అమలు చేసేవారు బారాస అధినేత కేసీఆర్( KCR ) .ప్రత్యార్థులపై పై చేయి సాధించడానికి మైండ్ గేమ్ అమలు చేసేవారు .

 Barasa Has Made Self Goal In Steel Plant Issue , Brs , Vizag Steel Plant , Kcr-TeluguStop.com

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) విషయంలో వేసీన వ్యూహం బెడిసి కొట్టిందా లేక తన వ్యూహాల్లో భాగంగానే అలా చేస్తున్నారా అన్న విశ్లేషణలు వస్తున్నాయి .

Telugu Singareni, Vizag Steel-Telugu Political News

గత కొంతకాలంగా స్తబ్దు గా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో సమీకరణాలు వేగంగా మారింది కేసీఆర్ ఎంట్రీ తర్వాతే .ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారి ప్రతిపక్షాలు కేంద్రాన్ని సరిగా నిలదీకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని ఇక తాము ఎంట్రీ ఇస్తున్నాం కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల లోనూ ప్రైవేటుపరం కానివ్వమనీ .తమ ప్రభుత్వం సంస్థల ద్వారా బిడ్ వేసి కేసీఆర్ దీనిని కాపాడుతారని బారసా ఆంధ్ర ప్రదేశ్ నేతలు చెప్పుకొచ్చారు .దానికి తగ్గట్టుగానే సింగరేణి ( Singareni )తరపు నుంచి కొంతమంది ప్రతినిదులు వచ్చి స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చలు కూడా జరిపారు ఇంకేముంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కేసీఆర్ కాపాడారంటూ గులాబీ శ్రేణులు హడావుడి చేశారు ….

Telugu Singareni, Vizag Steel-Telugu Political News

రేపో మాపో సింగరేణి బిడ్డు వేస్తుందని ఒప్పందాలు కుదిరిపోతాయంటూ హడావుడి జరిగింది.అయితే బిడ్ వేయడానికి నిర్ణీత గడువు సమయం ముగిసిపోయిన కూడా దానిని పెంచారు అయినప్పటికీ వచ్చిన 22 బిడ్ లలో తెలంగాణ ప్రబుత్వం తరఫున ఎవరు బిడ్ వేయలేదు.ఇంత హడావిడి చేసి పత్తా లేకుండా పోయిన విదానం మీద చర్చ జరుగుతుంది.

కేవలం రాజకీయపబ్బం గడుపుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప వాటి మీద నిలబడరని ఇది ఆయనకు అలవాటే అని తెలంగాణా ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఈ మాత్రం దానికి ఏదో ఉద్ధరించేటట్టుగా ప్రజల్లో మమ్మల్ని చులకన చేశారంటూ ఆంధ్ర నేతలు విమర్శిస్తున్నారు.మొత్తానికి ఈ వ్యవహారంలో కేసీఆర్ చర్యలు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగానే కనబడుతున్నాయి కనీసం వెనకడుగు వేయడానికి కారణమైన ప్రకటించకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube