మామూలుగా సెలబ్రిటీలు తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.అలా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరు తమలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
అయితే వాళ్ళు అలా టాలెంట్ బయట పెట్టడంతో కొందరు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా జబర్దస్త్ వర్ష కూడా ఒక వీడియో షేర్ చేయగా వెంటనే ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.
ఇంతకు ఆ వీడియోలో ఏముందో.అసలు నెటిజన్స్ ఏం అన్నారో ఒక్కసారి చూద్దాం.
జబర్దస్త్ వర్ష( Varsha ) గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.బుల్లితెరపై తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని ఒక సెలబ్రిటీ హోదాతో దూసుకెళ్తుంది.వెండితెరకు మిల్కీ బ్యూటీ తమన్నా అయితే బుల్లితెరకు మిల్కీ బ్యూటీ వర్ష అని చెప్పాలి.ఎందుకంటే ఈ బ్యూటీ అందం అలాంటిది కాబట్టి.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ జబర్దస్త్ లో గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయ్యింది.
తక్కువ సమయంలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.మరో కమెడియన్ ఇమ్మానియేల్( Emmanuel ) తో కలిసి హగ్గు లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.పలు షోలలో కూడా వీరిద్దరూ చేసే రచ్చ కు ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.అంతేకాకుండా ఈ బ్యూటీ పలు షో లలో గెస్ట్ గా పాల్గొని తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటుంది.
ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వర్ష బాగా సందడి చేస్తుంది.
ఈమెకు బుల్లితెర పైన కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉండే వర్ష.నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో యువతను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది.
నిజానికి ఈమె అందాలను చూస్తే మాత్రం హీరోయిన్ పీస్ అని చెప్పవచ్చు.కానీ దురదృష్టం కొద్దీ ఆమె బుల్లితెర పైన సెటిల్ అయింది.
అయినప్పటికీ కూడా ఈమెకు ఒక హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.
పొట్టి పొట్టి బట్టలతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తను స్టైలిష్ లుక్ లో కనిపించింది.
కారులో స్టైల్ గా దిగి చప్పట్లు కొట్టగానే వెంటనే ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆమెకు కోర్టు తగిలించడం ఇక ఆమె వెంటనే బాడీ గార్డ్స్ గా వెళ్లగా ఆ వీడియో చూసి కొందరు రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఓ నెటిజన్ మాత్రం.
టీబీ రోగం వచ్చిందా అంటూ దారుణంగా అవమానించారు.మరి ఆ వ్యక్తి ఎందుకలా కామెంట్ చేశాడో మాత్రం అర్థం కాలేకపోయింది.