అమెరికాలోని ఫ్లోరిడాకు( Florida, USA ) చెందిన పెర్ల్( Pearl ) అనే శునకం గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది.కేవలం రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ చివావా రకానికి చెందిన ఈ శునకం ప్రపంచంలోనే అతి చిన్న కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) అధికారికంగా గుర్తించింది.
పెర్ల్ యొక్క ఎత్తు కేవలం 3.59 అంగుళాలు.పొడవు 5 అంగుళాలు.పెర్ల్, సెప్టెంబరు 1, 2020న జన్మించింది.ఇప్పుడు ఇది అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత పొట్టి కుక్క( short dog ).గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం పెర్ల్ ఎత్తు 9.14 సెం.మీ (3.59 అంగుళాలు) ఉంటుంది.పొడవులో 12.7 సెం.మీ ఉంటుంది.2011లో జన్మించిన చివావా జాతికే చెందిన మిల్లీకి పెర్ల్‌కి బంధుత్వం ఉంది.
2020లో మిల్లీ మరణించే వరకు అది అత్యంత పొట్టి కుక్కగా గతంలో గిన్నిస్ రికార్డు సాధించింది.అది కేవలం 3.8 అంగుళాలు మాత్రమే ఉండేది.పెర్ల్ యజమాని వెనెసా సెమ్లెర్ దీనిపై స్పందించారు.పెర్ల్‌ను పెంచుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.లో షో డీ రికార్డ్ అనే టీవీ షో ఎపిసోడ్‌లో ఇటీవల మిలన్‌లో పెర్ల్ ప్రపంచానికి తొలిసారి కనిపించింది.
గుడ్డు ఆకారంలో ఉన్న సీటులో వెనేసా ఆమెను వేదికపైకి తీసుకెళ్లింది.పెర్ల్ ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటుందని వనేసా చెప్పారు.వనేసాకు మరో మూడు కుక్కలు ఉన్నాయి, కానీ చిన్నది మాత్రమే పెర్ల్.
ఇక ఈ పెర్ల్‌ను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు వెళ్లిపోవచ్చు.అది టీవీ రిమోట్ కంటే చాలా చిన్నగా ఉంటుంది.