బాలయ్య మాట్లాడితే ఆరు నెలలైనా అర్థం కాదు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) రెండో భార్య లక్ష్మీ పార్వతి( Lakshmi Parvati ) ఈ మధ్య కాలంలో బాలయ్య, లోకేశ్ ( Balayya, Lokesh )లపై ఎక్కువగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

 Laxmi Parvati Sensational Comments About Balakrishna Details Here Goes Viral In-TeluguStop.com

లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.తాజాగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ బాలయ్య మాట్లాడితే ఆరు నెలలైనా అర్థం కాదని కామెంట్లు చేశారు.

Telugu Balakrishna, Balayya, Chandrababu, Laxmi Parvathi, Laxmi Parvati, Laxmipa

లోకేశ్ ఏమీ రాని దద్దమ్మ అంటూ లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు.లోకేశ్ పాదయాత్ర( Lokesh Padayatra )లో రోజుకో విధంగా కామెడీ చేస్తున్నాడని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒక్కచోట కూడా గెలవని లోకేశ్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని టీడీపీ పరిస్థితి దిగజారిపోతుందని ఆమె వెల్లడించారు.లోకేశ్ బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని తమ ప్రభుత్వ వైఫల్యాలను లోకేశ్ చెప్పకపోతున్నాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Balayya, Chandrababu, Laxmi Parvathi, Laxmi Parvati, Laxmipa

చంద్రబాబు( Chandrababu ) పాపాలు పండిపోయాయని చంద్రబాబు సైకో అని ఆమె అన్నారు.లోకేశ్ సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవలు, కుక్కలను పోషిస్తున్నాడని లక్ష్మీ పార్వతి కామెంట్లు చేశారు.బాలయ్య ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని ఆరు నెలలైనా బాలయ్య చేసిన కామెంట్లను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని లక్ష్మీ పార్వతి అన్నారు.చంద్రబాబు ఐదు లక్షల కోట్ల రూపాయలను స్విట్జర్లాండ్, దుబాయ్ లో దాచారని లక్ష్మీపార్వతి అన్నారు.

Telugu Balakrishna, Balayya, Chandrababu, Laxmi Parvathi, Laxmi Parvati, Laxmipa

లక్ష్మీపార్వతి కామెంట్లకు సంబంధించి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.లక్ష్మీపార్వతి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.లక్ష్మీ పార్వతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.బాలయ్య మాత్రం లక్ష్మీ పార్వతిపై విమర్శలు చేయడానికి ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.ఆమె విమర్శలను బాలయ్య పెద్దగా పట్టించుకోవడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube