అవును, మీరు విన్నది నిజమే.ఎట్టకేలకు బీసీసీఐ ( BCCI ) భారత క్రికెట్ నియంత్రణ మండలిలో పనిచేసే ఆఫీస్ బేరర్స్( Office Bearers ) అలవెన్స్‌ల విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది.
విషయంలోకి వెళితే, గత కొంతకాలంగా బీసీసీఐలో పనిచేసే బేరర్స్ అలవెన్స్‌ల విషయమై పలుమార్లు చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.కాగా తాజాగా దీనిపైన ఓ క్లారిటీ వచ్చింది.
విదేశీ పర్యటనలకు వెళ్లే ఆఫీస్ బేరర్స్ జీత భత్యాలను బీసీసీఐ పెంచినట్టు తెలుస్తోంది.అలాగే ఫస్ట్‌క్లాస్ టికెట్‌తో ప్రయాణించేందుకు వారికి అనుమతి కూడా ఇచ్చింది.
ఇకపోతే, వారి రోజువారీ అలవెన్స్ విషయానికొస్తే 1000 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.దాదాపు ఏడేళ్ల తర్వాత రోజువారీ అలవెన్స్‌లో మార్పులు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆఫీస్ బేరర్స్ మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇంతకుముందు 750 డాలర్లుగా ఉండే అలవెన్స్‌ను ( Allowance ) వెయ్యికి పెంచడం విశేషం.ఇక దేశంలో జరిగే సమావేశాలకు హాజరయ్యే బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్లకు రోజుకు రూ.40వేల అలవెన్స్‌ను బీసీసీఐ చెల్లించనుంది.
అలాగే ‘వర్క్ ట్రావెల్’ కోసం రోజుకు రూ.30వేలు అందించనుంది.అంతేకాకుండా సూట్ రూమ్ బుక్ చేసుకొనే వెసులుబాటు కూడా కల్పించింది.
ఐపీఎల్ ఛైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్ కేటగిరీలో అలవెన్సులు వర్తిస్తాయి.బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా త్రైమాసిక సమావేశాలకు హాజరైతే రూ.40వేలు, అదేవిధంగా విదేశీ పర్యటనలకు వెళ్తే 500 డాలర్లను రోజువారీ అలవెన్సులుగా చెల్లించనుంది.ముగ్గురు సభ్యులు కలిగిన క్రికెట్ సలహా కమిటీ, పురుష, మహిళా జట్ల ప్రధాన కోచ్‌లు హాజరయ్యే ప్రతి సమావేశానికి రూ.3.5 లక్షలు ఇవ్వనుంది.అయితే వీరంతా గౌరవ పదవుల్లో ఉండే ఆఫీస్ బేరర్ల కేటగిరీలోకి వస్తారు.