ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ సరికొత్త వ్యూహాం

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ విస్తరణకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారు.విశాఖ ఉక్కు అజెండాగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 Kcr's New Strategy For Expansion Of Brs In Ap-TeluguStop.com

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే రేపు జయేశ్ రంజన్ బృందం వెళ్లనుంది.

అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్ధతు పలికిన విషయం తెలిసిందే.మరోవైపు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

కాగా సింగరేణి ద్వారా బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది.విశాఖ ఉక్కు బిడ్డింగ్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈనెల 15 వరకు బిడ్ వేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube