మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్నారా? అయితే ఈ యాంటీ-ట్రాకింగ్ టూల్‌ గురించి తెలుసా?

మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.నేటికీ మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌( Mozilla Firefox ) వినియోగదారులు వున్నారంటే దానికి కారణం ప్రైవసీనే.అవును… ఈ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వినియోగదారుల కోసం ఆన్‌లైన్ ప్రైవసీని కాపాడేందుకు ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లో కొత్త టూల్స్, టెక్నాలజీలను తీసుకు వస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా మొజిల్లా టోటల్ కుకీ ప్రొటెక్షన్( Mozilla Total Cookie Protection ) అనే సొంత యాంటీ-ట్రాకింగ్ టూల్‌ను ఒకదానిని ఆండ్రాయిడ్ ఫోన్లకు విస్తరించింది.

 Mozilla Firefox Anti Tracking Tool Total Cookie Protection Details, Mozilla, Moz-TeluguStop.com

అవును, ఇది పర్సనలైజ్డ్‌ యాడ్స్ చూపించడానికి మీ వెబ్ యాక్టివిటీని ట్రాక్ చేయకుండా వెబ్‌సైట్లను అడ్డుకోవడంలో ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఫైర్‌ఫాక్స్‌ 111 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో వుంది.TCP టూల్ డిఫాల్ట్‌గా ఆన్ అయి ఉంటుంది.తద్వారా వినియోగదారుల ప్రైవసీకి భంగం అనేది కలగదు.

నిజానికి మొజిల్లా 2018 నుంచి టోటల్ కుకీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తూ వస్తోంది.ఇది మొదటిసారిగా 2021లో విండోస్, మ్యాక్, Linuxలోని డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లకు విడుదల అయింది.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది రిలీజ్ కావడం విశేషం.

వచ్చే నెలలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.గూగుల్ ఈ సంవత్సరం ఇలాంటి ప్రైవసీ ఫీచర్‌నే ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇప్పట్లో ఆ ఫీచర్ విడుదలయ్యేలా కనబడడం లేదు.తాజా సమాచారం ప్రకారం గూగుల్ యాంటీ ట్రాకింగ్ టూల్‌ను 2024లో పరిచయం చేయవచ్చు.

ఇక మొజిల్లా కొత్త టూల్ లక్షల మంది ఆండ్రాయిడ్ యూజర్ల ఆన్‌లైన్ ప్రైవసీని( Online Privacy ) కాపాడుతుంది.వివిధ వెబ్‌సైట్లలోని కుకీస్‌ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా వాటికి అడ్డుకట్ట వేస్తుంది.

యూజర్ ఓపెన్ చేసి ప్రతి సైట్ కోసం ఒక సపరేట్ కుకీస్ స్టోరేజ్‌ను ఉపయోగించి వాటిని అడ్డుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube