ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri gopalakrishna) సినిమాల గురించి తన అభిప్రాయాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటున్నారు.ఇప్పటికే పలు సినిమాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన పరుచూరి తాజాగా వారసుడు సినిమా గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
వారసుడు మూవీ ఇష్టానుసారం ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నలను మార్చి తీసిన కథ అని ఆయన చెప్పుకొచ్చారు.
వారసుడు(Varasudu movie) సినిమాను చూస్తే ఈ సినిమా తెలుగు మూవీనే అనే భావన కలిగిందని ప్రధాన నటీనటులంతా తెలుగుతో సంబంధం ఉన్న నటీనటులు నటించడంతో ఆ విధంగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎండీని ఎన్నుకునే సీన్ లో విజయ్(vijay) నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుందని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు.హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను ఇంకొంచెం ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.
చివర్లో ముగ్గురు కొడుకులు తండ్రి అస్థికలను నదిలో కలిపినట్టు చూపించారని ఆ షాట్ చూపించకుండా ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.పాటల కోసం మాత్రమే హీరోయిన్ రష్మికను ఉపయోగించామని పరుచూరి వెల్లడించారు.అస్థికలను కలిపిన సీన్ వల్ల హీరో అంత చేసినా తండ్రిని కాపాడుకోలేదనే భావన కలుగుతుందని పరుచూరి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
శ్రీకాంత్ తో రిలేషన్ పెట్టుకున్న మహిళ ఏమైందనేది మధ్యలో చూపించలేదని పరుచూరి వెల్లడించారు.పరుచూరి వారసుడు మూవీపై ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వారసుడు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.సినిమాలో కుటుంబం, కుట్రలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వేస్ట్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
పరుచూరి చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.