ఇటీవల కాలంలో సరదాగా పందెం కాసి, పోటీలో నెగ్గడం కోసం తమ ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు.చివరికి కుటుంబ సభ్యులకు తీవ్ర శ్రోకనికి గురి చేస్తున్నారు.
నలుగురు విద్యార్థినులు సరదాగా పందెం కాశారు.ఒకరు ప్రాణాలు కోల్పోతే మిగిలిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.
పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని నీలగిరి జిల్లా కందల్ ప్రాంతంలోని మున్సిపల్ మాధ్యమిక పాఠశాలలో పోషకాహార విభాగం తరఫున ఇటీవలే విద్యార్థులకు విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగింది.అయితే 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు సరదాగా ఎవరు ఎక్కువ మాత్రలు మింగుతారు అని ఓ చిన్న పందెం వేసుకున్నారు.
ఒక విద్యార్థిని 45 మాత్రలు, మిగిలిన ముగ్గురు విద్యార్థినులు 30 మాత్రల చొప్పున మింగేశారు.
కాసేపటికి నలుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉదగై ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే 45 మాత్రలు మింగిన విద్యార్థిని మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం చనిపోయింది.
మిగిలిన ముగ్గురు విద్యార్థినులకు ప్రాణాపాయ స్థితి తప్పింది కానీ మూత్రపిండాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.చనిపోయిన విద్యార్థిని జైబా ఫాతిమా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.ఇంత మొత్తంలో విద్యార్థులకు మాత్రలు ఎవరు ఇచ్చారని దర్యాప్తు చేస్తుంది.
కాగా ఆ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ మహమ్మద్ ఆమీన్, ఉపాధ్యాయురాలు కైలావాణి ని సస్పెండ్ చేశారు.పోలీసులు ఈ సంఘటన పై స్పందిస్తూ సరదా కోసం పందెం వేసే అలవాటు మంచిది కాదని, విద్యార్థులు దీనిని దృష్టిలో ఉంచుకొని.
తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదని, ఇలాంటి సరదా పందెంతో కుటుంబాలలో తీవ్ర శ్రోకం మిగులుతుందని సూచించారు.