వేములవాడ :రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
శనివారం మధ్యాహ్నం కుటంబ సమేతంగా శ్రీస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.కుటుంబ సభ్యులతో కలిసి కోడె మొక్కును చెల్లించుకున్నారు.
అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.
అంతకుముందు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఆలయ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి కి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు ఎస్పీ చంద్రయ్య లు పూల మొక్కలు బహూకరించి స్వాగతం పలికారు.ఆ వెంటనే పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.