కవిత కోసం స్పెషల్ టీమ్స్ ? సర్వం సిద్ధం చేసుకున్న ఈడి ? 

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇప్పటికే అనేక అరెస్టులు జరిగాయి.ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండడంతో,  ఇప్పటికే అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

 Special Teams For Kavita Ed Prepared Everything ,sarath Chandra Reddy, Kavitha,-TeluguStop.com

ఢిల్లీలో విచారణకు రావలసిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.ఈడి ఇచ్చిన నోటీసులకు కవిత కూడా సమాధానం ఇచ్చారు.

ఈ మేరకు శనివారం ఉదయం 11 గంటలకు కవితను ఈడి అధికారులు విచారించబోతున్నారు.ఈ వ్యవహారం రాజకీయంగాను సంచలనంగా మారింది.

కేంద్ర అధికార పార్టీ బిజెపి కక్ష సాధింపు ధోరణితోనే ప్రతిపక్షాలపై ఈ విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించాయి అని ఇప్పటికే బీఆర్ఎస్ ఎదురుదాడి చేపట్టింది.ఇది ఇలా ఉంటే కవితను విచారణ సందర్భంగా ఆమెకు ఏ ప్రశ్నలు వేయాలి ?  ఏవిధంగా సమాధానాలు రాబట్టాలనే విషయంలో ఈడి అధికారులు ముందుగానే లిస్టు సిద్ధం చేసుకున్నారట.

దీనికోసం డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులతో టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణం పై ఈడి అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కవితకు సన్నిహితులుగా గుర్తింపు పొందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లే, బోయినపల్లి అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ల ఆధారంగా ఈ వ్యవహారంలో కవితకు ఎంత మేర భాగస్వామ్యం ఉంది అనే విషయాలపై అనేక ప్రశ్నలు అడగబోతున్నారట.ముఖ్యంగా హవాలా మార్గంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు,  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందించిన ముడుపులు , లిక్కర్ వ్యాపారంలో లబ్ధి కలిగే విధంగా పాలసీలో మార్పులు చేయాలన్న సంభాషణలు తదితర విషయాల్లో కవిత ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే విషయాలను ఈ విచారణ సందర్భంగా రాబట్టే ఆలోచనలో ఉన్నారట.

దీనికోసం అన్ని రంగాల్లోనూ అనుభవం ఉన్న అధికారులతో ఎంక్వయిరీ టీమ్ ను ఈడి అధికారులు ఏర్పాటు చేశారట.

Telugu Arunramachandra, Ed Enquiry, Directorate, Kavitha, Sarathchandra-Politics

ముఖ్యంగా కంపెనీల స్థాపనకు సంబంధించిన కార్పొరేట్ వ్యవహారాలపై అనుభవం ఉన్న అధికారులను,  డిజిటల్ టెక్నాలజీకి చెందిన నిపుణులను ఈ కమిటీలో నియమించారట.దీంతోపాటు ఢిల్లీ , హైదరాబాద్ నగరాల్లో పలు హోటళ్ల లో చర్చలు జరిపిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సీసీటీవీ వీడియో పుటేజి,  చార్టర్ ఫ్లైట్ వివరాలు,  మొబైల్ ఫోన్, ఐఎంఈఐ నంబర్లు , కాల్ డేటా ఇలా అన్నిటిని ఆధారం చేసుకుని కవితను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ తరఫు నుంచి అన్ని వ్యవహారాలు జరిగినట్లుగా ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలడంతో,  ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు.

Telugu Arunramachandra, Ed Enquiry, Directorate, Kavitha, Sarathchandra-Politics

అలాగే శరత్ చంద్ర రెడ్డి జైల్లోనే ఉన్నారు.వారిద్దరి నుంచి ఈడి అధికారులు వివరాలు సేకరించారు.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై నిన్ననే కవిత స్పందించారు.మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 దుర్మార్గమైనదని,  బాధితులను కూడా నిందితులుగా మారుస్తుందంటూ ఆమె చెప్పారు.ఈ సెక్షన్ రాక్షస స్వభావంతో కూడుకున్నదని,  దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ ఆమె కోరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనను విచారించే అవకాశం ఉన్నా.

  తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడం పైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కవిత చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube