ఇంటర్ బోర్డ్ సరికొత్త ఆలోచన..విద్యార్థులకు మనోధైర్యం కోసం సైకాలజిస్టులు..టోల్ ఫ్రీనెం.14416..!

ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్న క్రమంలో విద్యార్థులకు సలహాలు, సూచనలు చేసి వారిలో మనోధైర్యం నింపడానికి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు.ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతూ ఇతరులతో తమ భావాలను పంచుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

 Inter Board New Idea.psychologists For Morale Of Students..toll Free Num.14416.-TeluguStop.com

ఇటీవల కాలంలో చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు అవసరమైన విద్యార్థులు కాల్ చేస్తే సైకాలజిస్టులు మానసిక ఆందోళనను దూరం చేయడం, వారి సమస్యలకు సరైన పరిష్కారం, మనోధైర్యం నింపడం లాంటివాటిపై కౌన్సిలింగ్ ఇస్తారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మానసిక ఒత్తిడి, పరీక్షల ఒత్తిడి నుండి మంచి సలహాలు తీసుకోవచ్చు.అలాగే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో కూడా చాలామంది విద్యార్థులు ఒత్తిడిలకు గురవుతున్నారు.

అటువంటి సందర్భాల్లో టోల్ ఫ్రీ నెంబర్ బాగా ఉపయోగపడుతుంది.ఒకసారి సైకియాలజిస్టు దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే విద్యార్థులకు తగిన పరిష్కారాలు లభిస్తాయి.

ఈ టోల్ ఫ్రీ నెంబర్ పరీక్షలు జరుగుతున్న రోజులు, ఫలితాలు వెల్లడయ్యే రోజులలో, రోజంతా పనిచేస్తుంది.విద్యార్థులు పరీక్షల విషయంలో అనవసరంగా వివిధ రకాల ఆలోచనలు చేయకుండా, సంవత్సరం మొదటి నుండి చదువుపై శ్రద్ధ పెడితే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ప్రతి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిస్టిక్ మెంటల్ హెల్త్ క్లినిక్ పేరుతో ఫ్రీగా సైకాలజిస్ట్ లు సేవలు అందిస్తారు.దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు నవీన్ మిత్రల్ ఓ ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులలో సైకాలజిస్ట్ లను నేరుగా కలిసి కౌన్సిలింగ్ తీసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube