సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఒక మంచి కథ రాసుకొని దానికి తగిన హీరో కోసం వెతికి ఆ హీరోతో సినిమాలు చేసి మంచి సక్సెస్ కొడతారు.అలా ప్రతి సినిమాకి ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతారు డైరెక్టర్స్.
అయితే కొందరు మాత్రం మొత్తం రీమేక్ సినిమాలే చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ రీమేక్ సినిమాలు తీయడం లో స్పెషలిస్ట్ లు గా పేరు తెచ్చుకుంటారు.అలాంటి వాళ్లలో మొదట ప్లేస్ లో ప్రభుదేవా ఉంటాడు తమిళ్ లో హిట్ అయిన సినిమాలు తెలుగు లో తీస్తూ, తెలుగు లో హిట్ అయిన సినిమాలు తమిళ్ లో తీస్తు,హిందీ సినిమాలు తెలుగులో చేస్తూ ఉంటాడు అలా చేసి మంచి విజయాలు కూడా అందుకున్నాడు అలా చేసిన సినిమాలు ఏంటంటే.
తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా మంచి హిట్ అయిన విషయం మనకు తెలిసిందే…ఇక ఈ సినిమాని ప్రభుదేవా తమిళ్ లో విజయ్ తో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నాడు, అలాగే హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ అనే పేరు తో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.విక్రమార్కుడు సినిమాని కూడా హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా రౌడీ రాథోడ్ అనే పేరు తో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.
అలాగే ఇంకో రీమేక్ డైరెక్టర్ ఎవరంటే మోహన్ రాజా ఈయన తన తమ్ముడు అయిన జయం రవిని హీరోగా పెట్టీ తెలుగు లో హిట్ అయిన చాలా సినిమాలు రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాడు అందులో ఒకటి సిద్దార్థ్ జెనిలియా హీరో హీరోయిన్లు గా వచ్చిన బొమ్మరిల్లు సినిమాని సంతోష్ సుబ్రమణ్యం అనే సినిమా పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక రీసెంట్ గా చిరంజీవి హీరోగా చేసిన గాడ్ ఫాదర్ సినిమాకి కూడా తనే డైరెక్టర్ ఈ సినిమా మలయాళం లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసీఫర్ సినిమాకి రీమేక్ గా వచ్చింది కాగా ఈ సినిమా తెలుగు లో యావరేజ్ గా అడిందనే చెప్పాలి.అప్పట్లో అయితే భీమినేని శ్రీనివాసరావు కూడా రీమేక్ లు చేసి మంచి సక్సెస్ లు తీశాడు అందులో పవన్ కళ్యాణ్ తో తీసిన సుస్వాగతం, వెంకటేష్ తో చేసిన సూర్య వంశం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.