తారకరత్న మరణం తర్వాత భార్య అలేఖ్యా రెడ్డి పెట్టిన ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తారకరత్న మరణం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శోకసంద్రంలో మునిగిపోయారు.
తారకరత్న మరణం నందమూరి ఫ్యాన్స్ ను సైతం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.పుట్టినరోజుకు మూడు రోజుల ముందు అలాంటి ఘటన ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
కొన్నిరోజుల క్రితం తారకరత్న చిన్న కర్మ జరగగా మార్చి నెల 2వ తేదీన పెద్దకర్మ జరగనుంది.ఈ కార్యక్రమానికి తారకరత్న తల్లీదండ్రులు హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది.
తారకరత్నతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన అలేఖ్య ఇదే మా చివరి ఫోటో అని చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉందని అలేఖ్య చెప్పుకొచ్చారు.ఇదంతా ఒక కల కావాలని కోరుకుంటున్నానని అలేఖ్య తెలిపారు.
నన్ను అమ్మా బంగారు అని పిలిచే తారకరత్న స్వరం మళ్లీ వినాలని నేను అనుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు. తారకరత్న ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుండగా ఆ పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పోస్ట్ ను చూసిన తారకరత్న అభిమానులు ఆమెకు సపోర్ట్ గా సోషల్ మీడియా వేదికగా పెడుతున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
అలేఖ్య కుటుంబానికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సపోర్ట్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది. అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్ల గురించి మాత్రం అలేఖ్య ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.అలేఖ్యారెడ్డి కెరీర్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.