ఒకప్పుడు కమెడియన్ గా సునీల్ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒక పక్క ఆయనకి సీనియర్స్ అయిన బ్రహ్మనందం, అలీ, వేణుమాధవ్, ఏ వి ఎస్,ఎం ఎస్ నారాయణ లాంటి కమెడియన్స్ ఇండస్ట్రీ లో వాళ్ల కామెడీ తో ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు అలాంటి టైం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సునీల్ తన కామెడీ తో సూపర్ సక్సెస్ అయ్యాడు.

సీనియర్స్ నుంచి వచ్చే పోటీ ని ఎదుర్కొని కూడా తట్టుకొని నిలబడ్డాడు.సునీల్ అప్పట్లో ఎంత బిజీ గా ఉండేవాడంటే కనీసం ఆయనకి తినడానికి టైం కూడా ఉండేది కాదట అంత బిజీ కమెడియన్ గా ఉన్న సునీల్ రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు.అలాగే ఈ సినిమా తర్వాత వేరే హీరో సినిమాల్లో తను కామెడీ రోల్స్ చేయకుండా హీరోగానే కంటిన్యూ అయ్యారు అందులో భాగంగా వీరభద్రమ్ చౌదరి తో చేసిన పూలరంగడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఆ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి దాంతో హీరోగా ఆయన కెరియర్ ముగిసిపోయింది.
అయితే సునీల్ కెరియర్ హీరోగా ముగిసిపోవడనికి కారణం ఏంటంటే ఆయన అన్ని ఒకే తరహా పాత్రలు చేస్తూ సినిమా సినిమా కి అసలు వైవిధ్యం అనేది చూపించకుండా ఒకే తరహా పాత్రలు చేయడం వల్లే ఆయన హీరోగా తొందరగా ఫేడ్ అవుట్ అయ్యారు.ప్రస్తుతం సునీల్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయి మంచి మంచి రోల్స్ చేస్తున్నారు.
అందులో భాగంగానే పుష్ప సినిమా లో మంగళం శీను క్యారెక్టర్ చేశారు…
.