ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీలో మరో 31 మందికి స్థానం దక్కింది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు.
ఇందులో భాగంగా ఏపీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పీతల సుజాత నియామకం అయ్యారు.
అధికార ప్రతినిధులుగా నీలాయపాలెం విజయకుమార్, పి.రమేశ్, దాసరి శ్యాం సుందర్ శేషు నియమితులయ్యారు.అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా యనమల కృష్ణుడు, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, లుక్కా సాయిరామ్ గౌడ్, శీలం కిరణ్ కుమార్, మద్దిరాల జోసెఫ్ ఇమ్మానియేల్ తదితరులను నియమించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.