మోస్ట్ వాంటెడ్ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మంచి ఊపుమీద వుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా 2GB పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేసే సదుపాయాన్ని వినియోగదారులకు అందించేందుకు పటు పడుతోంది.ఈ ఫీచర్ వలన భవిష్యత్తులో వినియోగదారులు 2GB వరకు డేటాను ఇతరులకు పంపించుకోవచ్చు.
దాంతో కొన్నాళ్లుగా వాట్సాప్ వినియోగదారుల్లో ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది.అవును, పెద్ద సైజ్‌లో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేయలేకపోవడం వలన ఇంతకుముందు ఒకింత అసౌకర్యంగా ఉండేది.
అయితే ఇకనుండి ఆ బాధ తప్పుతుంది.
కాగా ఈ ఫీచర్‌ను భవిష్యత్తులో రానున్న iOS యాప్ అప్‌డేట్‌లో అందించాలనే యోచనలో ఉంది.WABetaInfo తెలిపిన సమాచారం మేరకు.2GB పరిమాణంలో ఉన్న పెద్ద డాక్యుమెంట్‌లను షేర్ చేయడం సులభతరం చేయబోతోంది వాట్సాప్.అయితే ఈ తరహా ఫీచర్ కొత్తది కాదు.ఎందుకంటే వాట్సాప్ ఇప్పటికే గత సంవత్సరం 512 మంది వ్యక్తులను గ్రూప్‌లో యాడ్ చేసే సదుపాయం కల్పించింది.ఈ క్రమంలోనే తాజా వాట్సాప్ బీటా, iOS 23.3.0.76 అప్‌డేట్ ద్వారా భవిష్యత్తులో iOS యాప్ అప్‌డేట్‌లో ఇలాంటి ఫీచర్‌ను విడుదల చేయడానికి వాట్సాప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని WABetaInfo పేర్కొంది.
పెద్ద డాక్యుమెంట్‌లను షేర్ చేయగల సామర్థ్యాన్ని ప్రకటించే ప్రెజెంటేషన్ షీట్ వాట్సాప్ ప్రస్తుతం డెవలప్ చేస్తోంది.ఇక ఇటీవలకాలంలో చూసుకుంటే, వాట్సాప్ డాక్యుమెంట్ క్యాప్షన్, లాంగర్ గ్రూప్ సబ్జెక్ట్‌లు, డిస్క్రిప్షన్‌లు, 100 మీడియా వరకు షేర్ చేసుకునే సదుపాయాలు అందించిన సంగతి అందరికీ తెలిసిందే.వీటితోపాటు అవతార్ క్రియేట్ చేయడం, షేర్ చేయడం, ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేసుకునే ఆప్షన్లు కూడా అందజేసింది.ప్లే స్టోర్(Play Store) నుంచి ఆండ్రాయిడ్ వాట్సాప్ అప్‌డేట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు ఈ ఫీచర్లను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.