ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ క్రమంలో శంషాబాద్ డీసీపీ, ఏసీపీ సహా ఇతర పోలీస్ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.
ప్రలోభాల కేసు విచారణను సీబీఐకు అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.గత సంవత్సరం డిసెంబర్ 26న కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని తెలిపింది.
మరోవైపు కేసు వివరాల కోసం ప్రభుత్వానికి సీబీఐ చాలా సార్లు లేఖ రాసింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.