చిన్న హీరో సినిమాకి నో చెప్పిన జూనియర్ శ్రీదేవి.. ఫ్లాప్ హీరోయిన్ కి ఇంత బిల్డప్ ఎందుకో

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ జూనియర్ శ్రీదేవి బాలీవుడ్ లో ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

 Janhvi Kapoor Says No To Tollywood Young Hero , Janhvi Kapoor, Ntr, Ramcharan, S-TeluguStop.com

కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదలయ్యాయి.అవి కూడా నిరాశనే మిగిల్చాయి.

సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా అనేక మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.హీరోయిన్ గా అన్ని ఫెయిల్యూర్స్ అయినప్పటికీ ఈమె ఫోటో షూట్స్ తో అందరిని అలరిస్తోంది.

కేవలం ఆ ఫోటో షూట్స్ తోనే స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.బాలీవుడ్ లో ఈమె కి పెద్దగా క్రేజ్ లేదు.

అయినా కూడా టాలీవుడ్ హీరో లు ఈమె తో నటించేందుకు మోజు పడుతున్నారు.ఇటీవల రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఒక సినిమా లో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయిందని ప్రచారం జరుగుతుంది.

అంతే కాకుండా ఎన్టీఆర్ కి కూడా జోడిగా ఈమె హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Jahnvi Kapoor, Ram Charan, Sridevi, Tollywood Young-Movie

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు జోడిగా నటించబోతున్నందుకు గాను ఈమె కు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.ఇక టాలీవుడ్ కి చెందిన మరో యంగ్ హీరో కి జోడి గా ఈమెను నటింపజేసేందుకు నిర్మాతలు ప్రయత్నించారట.భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఆఫర్ చేసినా కూడా జాన్వీ కపూర్ ఆ హీరో తో సినిమా ను చేసేందుకు అంగీకరించలేదంట.

స్టార్ హీరో లతో మాత్రమే సినిమాలు చేయాలని ఆమె భావిస్తుందట.చిన్న హీరోలతో సినిమాలు చేస్తే ఆ తర్వాత కూడా చిన్న హీరోల నుండి ఆఫర్స్ వస్తాయి.

పెద్ద హీరోల సినిమా ల్లో ఛాన్సులు కావాలంటే కాస్త వెయిట్ చేయాలని ఆమె భావిస్తోందట.మొత్తానికి ఆ చిన్న హీరో కి నో చెప్పి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ ముద్దుగుమ్మ నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube