APలో తొలిసారిగా అడవిబిడ్డల కోసం అంబులెన్స్?

ప్రపంచం చాలా విషయాల్లో ముందుకు దూసుకుపోతోంది.సైన్స్, టెక్నాలజీ రంగం అయితే ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన పనిలేదు.

 Ambulance For Tribal Areas For The First Time In Ap-TeluguStop.com

అయినా కొన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అనేవి అందడం లేదనేది జగమెరిగిన సత్యం.మౌలిక సదుపాయాలు అందక ప్రతీ సంవత్సరం కొన్ని వేలమంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న విషయం అందరికీ విదితమే.

అడవుల్లో సరైన రోడ్లు లేకపోవడంతో పేషంట్లను సకాలంలో ఆస్పత్రులకు తరలించడం వారికి కష్టంగా మారుతోంది.ఇక ప్రకృతి విపత్తుల సమయాల్లో అయితే చెప్పాల్సినవసరం లేదు.

ఈ నేపథ్యంలోనే గిరిజనులను దృష్టిలో పెట్టుకొని వైద్య సదుపాయం దిశగా ఏపీ ప్రభుత్వం కొత్త బైక్‌ను రూపొందించింది.అడవుల్లో అంబులెన్సులు తిరగడం కష్టం కాబట్టి ‘బైక్ అంబులెన్స్’ను ఒకదానిని తయారు చేయించింది.

కాగా ఏపీ అధికారులు ఇలాంటి బైక్‌లను రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెప్పడం కొసమెరుపు. కాకినాడ JNTU ప్రొఫెసర్, డిజైన్ ఇన్నోవేటివ్ సెంటర్ డైరెక్టర్ అల్లూరు గోపాలకృష్ణ దీన్ని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

మొత్తం 108 బైక్‌ అంబులెన్సులను కొనడానికి AP ప్రభుత్వం టెండర్లు పిలిచింది.దీని ఖరీదు రూ.4 లక్షలు అని తెలుస్తోంది.

Telugu Ambulance, Andhra Pradesh, Bike Ambulance, Latest, Tribal Areas-Latest Ne

బజాజ్ ఎవెంజర్ బైక్‌కు పేషంట్ సీటును జోడించి దీన్ని తయారు చేయడం విశేషం.వీటి ప్రత్యేకతలు ఏమంటే ఈ బైకులు సాధారణమైన రోడ్లపైన కూడా పరుగెడతాయి.అత్యవసర పరిస్థితులలో పేషంట్లను ఆస్పత్రులకు తరలిస్తాయి.

ఎగుడు, దిగుడు ప్రాంతాల్లో కూడా ఇవి మసలుతాయి.డ్రైవర్ వెనక ఉండే సీటును 90 డిగ్రీల కోణంలో రౌండుగా తిరిగే ఏర్పాటు చేయబడి వుంది.

వీటి సాయంతో 110 డిగ్రీల వెనక్కి వాల్చొచ్చు.ఈ బైక్స్‌ను GPSతో అనుసంధానించారు.

పేషంట్ పరిస్థితిని, చుట్టు పక్కల వైద్యు సదుపాయాల గురించి తెలుసుకునే ఏర్పాట్లు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube