మెగా వారసులు రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన గత పది సంవత్సరాల క్రితం ఉపాసన కామినేనిను వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి జరిగి పది సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ చిరంజీవి ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.అయితే ఉపాసన సరోగసి ద్వారా తల్లి కాబోతున్నట్టు మరోసారి వార్తలు వచ్చాయి.
కానీ ఈమె తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తన ప్రెగ్నెన్సీ గురించి వచ్చే వార్తలన్నింటికీ పులిస్టాప్ పడింది.
ఇకపోతే మరికొన్ని నెలలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ సోదరి సుస్మిత తన తమ్ముడు చరణ్ కు పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త మాకు చాలా సంతోషాన్ని కలిగించింది.ఈ శుభవార్తను మేమంతా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపారు.ఇక రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ గురించి ఈమె మాట్లాడుతూ…
రామ్ చరణ్ కు పాప బాబు ఎవరు పుట్టిన మాకు చాలా సంతోషమేనని తెలిపారు.అయితే తన అభిప్రాయం ప్రకారం ఇప్పటికే మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అబ్బాయి మాత్రమే లేరు అందుకే చరణ్ కు అబ్బాయి పుడితే బాగుంటుందని తన మనసులో ఉన్న కోరికను ఇలా బయటపెట్టారు.సుస్మిత తనకు మేనల్లుడే కావాలని మేనల్లుడు అయితే బాగుంటుందంటూ తన కోరికను బయటకు చెప్పడంతో తప్పకుండా చరణ్ కు అబ్బాయి పుడతారని మెగా అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.మరి మెగా కాంపౌండ్ లోకి మరి వారసుడు అడుగు పుడతారా లేదా వారసురాలు అడుగు పుడతారా అనే విషయం తెలియాల్సి ఉంది.