మగవాళ్ల కోసం బెస్ట్ ఫుట్‌వేర్ స్టైలింగ్ రూల్స్ ఇవే..

ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి.

 These Are The Best Footwear Styling Rules For Men, Men's, Foot Ware, Tips, Healt-TeluguStop.com

మగవారి విషయంలో ఫ్యాషన్ కేవలం సూట్లు, టైలకు మాత్రమే పరిమితం కాదు.పురుషులకు ఫ్యాషన్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి.

దుస్తులతో పాటు మంచి ఫుట్‌వేర్ మీకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.ఒక మంచి జత బూట్లు మీ రూపాన్ని మార్చుతాయి.

మీ బట్టలు ఎంత గొప్పగా ఉన్నా, మీరు వాటిని తప్పుగా ధరించినట్లయితే, అది ఎదుటి వారికి సరైన అభిప్రాయం కలిగించదు.ముఖ్యంగా ఫుట్ వేర్ విషయంలో మగవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

దీనికి సంబంధించి మగవారు పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

మగవారు మంచి దుస్తులు ధరించడంతో పాటు వాటికి తగ్గ మంచి ఫుట్ వేర్ కూడా వేసుకోవాలి. షూలు కొనుగోలు చేసినప్పుడు నాణ్యమైనవి కొనుగోలు చేయడం మంచిది.దీర్ఘకాలం మన్నేవి తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం అవి మన్నుతాయి.

మీరు వేసుకునే దుస్తులకు తగ్గట్టు టై, బెల్ట్, బ్యాగ్ ఇతరమైన వాటి విషయంలోనూ జాగ్రత్తపడాలి.అవన్నీ ఒకే రంగులో ఉన్నా చూసే వారికి అంత నచ్చదు.

అయితే ఏది ధరించాలో అనే సందేహం ఉన్నప్పుడు మీరు టాన్, బ్రౌన్, నలుపు, తెలుపు వంటి రంగులవి ధరించినా ఆకర్షణీయంగా ఉంటుంది.చాలా మంది మంచి షర్టులు ధరించినా, ప్యాంట్లు విషయంలో అశ్రద్ధ వహిస్తారు.

ఫిట్‌గా ఉండే ప్యాంట్లు చూడడానికి బాగుంటాయి.ఇక సాక్సులను కూడా వేసుకునే షూలను బట్టి ఉండాలి.

లోఫర్లు ధరిస్తే ముందుగా ఫుల్ సాక్స్‌లు వేసుకోవాలి.స్నీకర్లను ధరిస్తే మాత్రం చీలమండల వరకు ఉండే సాక్సులు వేసుకోవాలి.

నాణ్యమైన షూలు మాత్రమే ధరించాల్సిన అవసరం లేదు.అయితే వేసుకున్న షూలు ఖచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

మట్టి, బురద వంటివి అంటుకుంటే చూసే వారికి చిరాకుగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube