టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ గురించి వాక్యలు చేసిన విషయం తెలిసిందే.బాలీవుడ్ వారి మెప్పు పొందడం కోసం ఆమె ఆ పరిశ్రమ పై ప్రశంసలు కురిపించి దక్షిణాది చిత్రపరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని పలువురు విమర్శించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వార్తలపై స్పందించింది రష్మిక మందన.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
నాలో నేనొక లోపాన్ని గుర్తించాను.అది ఏమిటంటే.
ఏ విషయాన్ని అయినా విడమర్చి చెబుతున్నాను.దానివల్ల నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని చాలా మంది విమర్శిస్తున్నారు.మిషన్ మజ్ను ఈవెంట్ లో కూడా అదే జరిగింది.బాలీవుడ్ రొమాంటిక్ పాటల గురించి మాట్లాడుతున్నప్పుడు దక్షిణాదిలో మాస్, డ్యాన్స్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయని అన్నాను.
అయితే అది నా పూర్తి సమాధానం కాదు.దక్షిణాదిలో ఎన్నో మాస్, ఐటెమ్, రొమాంటిక్ పాటలు ఉన్నాయి.
నేను నటించిన సినిమాలలోని ఆ పాటలు ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నానని ఆరోజు చెప్పాలనుకున్నాను.కానీ నా మాటలు వినడానికి అక్కడి వాళ్లు సిద్ధంగా లేరు.
నా మాటల్ని మధ్యలోనే ఆపేశారు.దానివల్ల అందరికీ నా వ్యాఖ్యలు తప్పుగా అర్థమయ్యాయి.నా సినిమాల్లోనే ఎన్నో రొమాంటిక్ పాటలు ఉన్నాయి.అలాంటప్పుడు నేనెలా అలాంటి వ్యాఖ్యలు చేయగలను చెప్పుకొచ్చింది రష్మిక మందన.
ప్రస్తుతం నేను నాలుగు పరిశ్రమల్లో వర్క్ చేస్తున్నాను.ప్రతి సినిమా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఈ స్థాయిలో ఉన్నాను.అందుకు గర్వంగా ఫీలవుతున్నాను.అయితే, నేను మూలాలు మర్చిపోయానని, అహంకారంతో నాకు కొమ్ములు వచ్చాయని కొంతమంది ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.ప్రేక్షకులను ఇలాంటి విమర్శలతో తప్పుదోవ పట్టించడం విచారకరం అంటూ తనపై వస్తున్న రూమర్స్ పై అసహనం వ్యక్తం చేసింది రష్మిక మందన.