1.రేపు విచారణకు హాజరవుతా: సునీల్ కనుగోలు
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో రేపు విచారణకు హాజరవుతానని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు పోలీసులకు తెలిపారు.
2.చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వారి మధ్య జరిగింది.
3.మిలటరీ చీఫ్ తో మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ మిలిటరీ థియేటర్ కమాండ్స్ ఏర్పాటుపై మార్చిలో సమీక్ష నిర్వహించబోతున్నారు.ఈ నేపథ్యంలో మిలటరీ చీఫ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే భేటీ కానున్నారు.
4.రేంజర్ల రాజేష్ పై కమలానంద భారతి ఆగ్రహం
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కమలానంద భారతి స్వామీజీ ఈరోజు దర్శించుకున్నారు అనంతరం అమ్మవారిపై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన కమలానంద భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు
5.అజిత్ సినిమాను బ్యాన్ చేసిన సౌదీ అరేబియా
హీరో అజిత్ నటించిన తునివ్ సినిమా పై సౌదీ అరేబియా నిషేధం విధించింది.ఈ సినిమాలో మితిమీరిన హింసతో పాటు ఇస్లాం వ్యతిరేకత లింగమార్పిడి పాత్రలు వంటి ఉండడమే కారణమట.
6.ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతి కీలక వ్యక్తులు
లోకేష్ కు నాయకత్వం అప్పగించేందుకు తారక్ సిద్ధంగా లేరని ఎన్టీఆర్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా అతడు టిడిపిలోకి వస్తాడని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.
7.జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్
జమ్మూ కాశ్మీర్లోని ఓన్ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు .
8.మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్
గుంటూరు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
9.నేడు ఏపీలో గ్రూప్స్ పరీక్ష
నేడు ఏపీలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది.18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
10.నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ
నేడు ఆర్ఎస్ఎస్ నేతలు కీలక భేటీ నిర్వహించనున్నారు.
11.నేడు వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్
విశాఖలో నేడు వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
12.నేడు హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ
నేడు హిమాచల్ ప్రదేశ్ మంత్రి వర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.సిమ్లా లోని రాజ్ భవన్ లో వేడుక జరగనుంది.
13.ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 19 లేదా 20 తేదీల్లో తెలంగాణ కు రానున్నారు.
14.జోషి మట్ పగుళ్లపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష
ఉత్తరాఖండ్లోని పవిత్ర పట్టణంగా పేరన్న జోషి ఉండడం, బిల్డింగులు పగుళ్లు ఏర్పడడం తదితర విషయాలపై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది.
15.కందుకూరు గుంటూరు ఘటనపై విచారణ కమిషన్
టిడిపి అధినేత చంద్రబాబు కందుకూరు గుంటూరులో నిర్వహించిన సభలో జరిగిన తొక్కేసిన ప్రభుత్వం నియమించింది.
16.చిరు బాలయ్య పై ఏపీ మంత్రి కామెంట్స్
బాలకృష్ణ సినిమా ఫంక్షన్లను అడ్డుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి మూవీ ఫంక్షన్ కి ఆర్కే బీచ్ లో నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చి ఉంటారని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.
17.యాంకర్ అనసూయకు కాజాతో సత్కారం
టీవీ యాంకర్ సినీనటి అనసూయ భరద్వాజ్ కు సురుచి పి ఆర్ ఓ వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు.
18.మోహన్ బాబు తో వైసీపీ ఎంపీ మాధవ్ భేటి
ప్రముఖ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ బాబు నిర్మించిన ఆలయానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయనకు మోహన్ బాబు స్వాగతం పలికారు.
19.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం
కామారెడ్డి పట్టణ ప్రణాళిక వివాదం బాధ్యత రైతుల ఐకాసా తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది.సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశానికి 7 విలీన గ్రామాల రైతులు హాజరయ్యారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,960
.