జాగ్రత్త: ఈ డివైజ్‌ మీ బెడ్‌రూంలోకి తొంగి చూస్తోందని మీకు తెలుసా?

పెరిగిపోతున్న టెక్నాలజీ వలన ఎన్ని లాభాలు వుంటాయో, అంతకన్నా ఎక్కువ నష్టాలు వుంటాయని చెబుతున్నారు కొందరు.కలియుగం కాదిది డిజిటల్‌ యుగం అని చెబుతున్నారు మరి.

 Did You Know This Device Is Lurking In Your Bedroom , Bed Room, Device, Technol-TeluguStop.com

ఇకపోతే ప్రజలు నేడు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అమెజాన్‌ అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్‌ హోమ్ వంటివి చాలా బాగా పాపులర్ అయ్యాయి.

అలెక్సా’ అనేది నేడు ఎన్నో కుటుంబాల్లో భాగమైపోయింది కూడా.అలాంటివాటిలో మనుషులు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఇంట్లోని వివిధ పరికరాలను ఆన్, ఆఫ్ చేసేస్తున్నారు.

అయితే, ఇలాంటి పరికరాన్ని ఉపయోగించేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఈ పరికరాన్ని బెడ్‌రూమ్‌లో అస్సలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే.మీరు మాట్లాడుకునేదంతా ఈ పరికరం రికార్డు చేస్తోంది.

ఆ డాటాను అమెజాన్ ఉద్యోగులు కొంతమంది వింటున్నారని కూడా నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వాటి కారణంగా మీ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగి కలతలు చెలరేగే ప్రమాదం వుంది.అందుకే ఈ పరికరాన్ని కిచెన్, హాల్‌ వంటి ప్రదేశాల్లో మాత్రమే పెట్టుకోవాలని అంటున్నారు.అమెజాన్ కంపెనీ కూడా ఈ విషయం నిజమేనని తాజాగా అంగీకరించింది.

అయితే, అలెక్సాను మరింత మెరుగుపరచడం కోసం, రీసెర్చ్‌లో భాగంగానే ఈ పని చేస్తున్నామని కూడా చెప్పింది.ఈమేరకు ఫాక్స్ న్యూస్ ఈ వివరాలను వెల్లడించింది.మీ ఇంట్లో ‘అలెక్సా’ ఒక భాగమైతే దానిని అవసరం మేరకే వాడండి తప్ప, అన్నివేళలా ఆన్ చేసి వుంచకండి అని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube