నాగార్జున నిజస్వరూపం బయటపెట్టిన ప్రముఖ లాయర్.. పొగరు అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున అటు సినిమాల్లో సక్సెస్ సాధించడంతో పాటు ఇటు వ్యాపారాల్లో కూడా సక్సెస్ సాధించారు.కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి రియాక్ట్ కావడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే.

 Famous Lawyer Shocking Comments About Nagarjuna Details Here Goes Viral In Socia-TeluguStop.com

అయితే ప్రముఖ లాయర్లలో ఒకరైన కళానిధి నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని టాప్ లాయర్లలో ఒకరైన కళానిధి నాగార్జునకు గోవాకు సంబంధించిన పంచాయితీ నుంచి వచ్చిన నోటీస్ గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున పీఏ ఒకరోజు నాకు ఫోన్ చేసి నాగార్జున ఫారెన్ కారు కొన్నారని ఆ కారును పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే ఏమైనా సమస్య వస్తుందా అని అడిగారని కళానిధి తెలిపారు.నాగార్జున ప్రపంచంలోని లేటెస్ట్ కార్లలో కచ్చితంగా ఒకటి తీసుకుంటారని ఆయన అన్నారు.

తాను అక్కినేని వెంకట్ ఇంటికి వెళ్లిన సమయంలో షెడ్ లో ఉన్న కార్లను చూశానని కళానిధి తెలిపారు.ఫ్యాన్సీ నంబర్లకు నాగ్ ప్రాధాన్యత ఇస్తాడని ఆయన పేర్కొన్నారు.

నాగార్జున చాలా పొగరు మనిషని ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరని కళానిధి తెలిపారు.నాగార్జునకు టెంపర్ ఎక్కువని నేను ఫిజికల్ గా చూశానని ఆయన చెప్పుకొచ్చారు.

టీవీలో కనపడే నాగార్జునకు, బయట కనపడే నాగార్జునకు చాలా తేడా ఉందని కళానిధి కామెంట్లు చేశారు.

సినిమా షూట్ సమయంలో నాగ్ ను కలవాలని నేను స్లిప్ పంపించానని ఆయన అన్నారు.అరగంట ఎదురుచూసినా ఫలితం లేదని ఇది నాగార్జున తత్వం అని కళానిధి పేర్కొన్నారు.ఎంతోమంది సెలబ్రిటీలను నేను కలిశానని కానీ నాగార్జునలా వ్యవహరించాల్సిన వాళ్లు ఎవరూ లేరని ఆయన చెప్పుకొచ్చారు.

గోవాలో నాగార్జున నిబంధనలు ఉల్లంఘించారని కళానిధి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube