చాలా మంది వారికి తెలిసిన సగం నిజానికి మరింత మేకప్ వేసి ఉన్నది లేనిది కల్పించి చెప్పేస్తూ ఉంటారు.అందులో మీడియా వారైతే మరి ఎక్కువ.
ఒక శాతం నిజాలకు 99 శాతం అబద్దాలను అందంగా రంగులద్దినట్టు చేస్తారు.అది నిజమనే భ్రమలో సామాన్యులు ఉంటారు.
అందుకే ప్రతి అబద్దం వెనక సంఘర్షణ పడి మరణించిన ఒక నిజం ఉంటుంది.ఇప్పుడు ప్రపంచం గుర్తించాల్సిన ఆ నిజం ఏంటి అంటే 110 సినిమాలకు దర్శకుడిగా, కొన్ని సినిమాలకు నిర్మాతగా, ఇప్పటికి 80 ఏళ్ళ వయసులో ఒక రిటైర్మెంట్ అనేది లేకుండా అలుపెరగక శ్రమిస్తున్న వ్యక్తి కె రాఘవేంద్ర రావు.
అయన వ్యక్తి గత జీవితం ఎప్పుడు ఎదో ఒక చిక్కు ముడిలా ఉంటుంది.అయన తల్లి అని కొంత మంది ఒకరి పేరు చెప్తారు.మరొకరు కాదు అంటారు.ఈ విషయాలపై ఈ రోజు ఒక స్ప్రష్టత ఇవ్వాలని అనిపించింది.
కె రాఘవేంద్ర రావు నిన్నటి జెనరేషన్ నుంచి నేటి జెనరేషన్ వరకు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి.అయన తండ్రి కే ఎస్ ప్రకాష్ రావు.
అయన ఒక దర్శకుడు మరియు నిర్మాత.అయన సినిమా వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు రాఘవేంద్ర రావు గారు.
అయన తల్లి కోటేశ్వరమ్మ.కే ఎస్ ప్రకాష్ రావు మరియు కోటేశ్వరమ్మ దంపతులకు నలుగురు సంతానం.
మొదటి వ్యక్తి కృష్ణ మోహన్ రావు, తర్వాత రాఘవేంద్ర రావు ఆ తర్వాత ఇద్దరు కూతుళ్లు స్వతంత్ర మరియు మంజుల.
కానీ చాల మంది మీడియాలో తెలిసి తెలియక రాఘవేంద్ర రావు అలనాటి స్టార్ హీరోయిన్ వరలక్ష్మి అని అంటూ ఉంటారు.అయితే ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే కే ఎస్ ప్రకాష్ గారు వరలక్ష్మి ని సినిమాల్లో నటిస్తున్న క్రమం లో ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు.వీరికి కేవలం ఒక కుమారుడు మాత్రామే జన్మిచారు.
అతడికి ప్రకాష్ రావు అంటూ తన భర్త పేరు పెట్టుకుంది వరలక్ష్మి. అతడు కూడా సినిమాల్లో తొలుత కెమెరా మెన్ గా పని చేసాడు.
ఆ తర్వాత మోహన్ బాబు తో రౌడీ గారి పెళ్ళాం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.ఆ తర్వాత ఏవో కారణాలతో చిన్న వయసులోనే చనిపోయాడు.
మొత్తానికి వరలక్మి కి ఉన్న ఏకైక సంతానం ప్రకాష్ రావు చిన్న వయసుకొనే తల్లికన్నా ముందుగానే మరణించాడు.రాఘవేంద్ర రావు తల్లి వరలక్ష్మి అని జరుగుతున్న ప్రచారం సుద్ద అబద్దం.