జుట్టు చివర్లు తరచూ చిట్లిపోతుందా? వర్రీ వద్దు.. ఇలా చేయండి!

సాధారణంగా కొందరి జుట్టు చివర్లు తరచూ చిట్లిపోతుంటుంది.అందులోనూ ప్రస్తుత చలికాలంలో ఈ సమస్య మరీ అధికంగా వేధిస్తూ ఉంటుంది.

 A Home Remedy To Prevent Split Ends In Hair, Home Remedy, Split Ends, Hair, Hair-TeluguStop.com

ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.అందుకే చాలా మంది చిట్లిన జుట్టును తరచూ ట్రిమ్ చేస్తుంటారు.

అయితే ట్రిమ్మింగ్ చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే పొరపాటే.ఎన్ని సార్లు ట్రిమ్ చేసినా సరే జుట్టు మళ్ళీ మళ్ళీ చిట్లి పోతూనే ఉంటుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యం, ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు వాటర్ ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, గుప్పెడు కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

జెల్లీ స్ట్రక్చర్ లోకి వచ్చిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి.అనంతరం రెండు గంటల పాటు షవర్ క్యాప్ ధరించి అప్పుడు మైల్డ్‌ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చిట్లిన జుట్టు రిపేర్ అవ్వడమే కాదు మళ్ళీ మళ్ళీ జుట్టు చిట్లకుండా సైతం ఉంటుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు సిల్కీగా మరియు స్మూత్ గా కూడా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube