యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.ముందు నుండి నిఖిల్ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాడు.
ఈయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కార్తికేయ వంటి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.ఈ తర్వాత ఈయన పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.
ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.
ఇలా ఈయన సినిమాలకు డిమాండ్ ఏర్పడడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ ను పెంచేసినట్టు టాక్ వినిపిస్తుంది.ఏ హీరో అయినా సక్సెస్ రేట్ ఉన్నప్పుడే డిమాండ్ చేస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు నిఖిల్ కూడా కార్తికేయ తో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.ఈయన కొత్త సినిమాలకు 8 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
అయినా కూడా నిర్మాతలు ఓకే చెబుతున్నారని సమాచారం.నిఖిల్ త్వరలోనే 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో కూడా కార్తికేయ జోడీ నే కనిపించ బోతుంది.దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుంది.మరి ఈ సినిమాతో సక్సెస్ కొనసాగిస్తాడో లేదో చూడాలి.