ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికైన ది కాశ్మీర్ ఫైల్స్.. సంతోషం వ్యక్తం చేసిన డైరెక్టర్!

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా పలు భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇలా చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో దికాశ్మీరీ ఫైల్స్ ఒకటి.

 The Kashmir Files Selected For The Prestigious Award Director Expressed Happines-TeluguStop.com

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక అగర్వాల్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అభిషేక్ అగర్వాల్ కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించారు.ఇక ఈ సినిమాకి కూడా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి.ఇకపోతే తాజాగా ది కాశ్మీరి ఫైల్స్ సినిమా మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుంది.

ఈ సినిమా విడుదలైన అనంతరం పలువురు సినిమా పట్ల విమర్శలు కురిపించడంతో వివాదాలను ఎదుర్కొంది.అయితే ఇలాంటి ఎన్నో వివాదాలు నడుమ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం విశేషం.ఇదిలా ఉండగా తాజాగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డును సొంతం చేసుకుంది.

ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది.ఈ క్రమంలోనే ఈ అవార్డును డైరెక్టర్ వివేక అగ్నిహోత్రి అందుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈయన తన సంతోషాన్ని తెలియజేస్తూ ఈ అవార్డును తాను ఉగ్రవాద బాధితులందరికీ అంకితం ఇస్తున్నానని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube