లండన్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఆవిర్భావ వేడుకలు ఎప్పుడంటే..

దేశాలలో మొట్టమొదటిసారిగా లండన్ లోని టవర్ బ్రిడ్జి దగ్గర బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ జెండా ఆవిష్కరణ సమయంలో దేశ్ కి నేత కేసిఆర్, అబ్ కీబార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది.

 Inauguration Of Brs Flag In London , Brs, London, Ashok Gowda Dusari, Vice Pre-TeluguStop.com

ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడు దూసరి మాట్లాడుతూ లండన్ లోని చరిత్పాత్మక టవర్ బ్రిడ్జి దగ్గర టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందని చెప్పారు.మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో గులాబీ జెండాను మొట్టమొదటిసారి లండన్ లో ఎగురవేసి కేసిఆర్ కు మద్దతు తెలిపామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు దేశంలోనే గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ జెండాను మొట్టమొదటగా ఎగరవేశామని అశోక్ తెలిపారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు కావాలంటే అది కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ఎన్ఐఆర్ లు అందరూ నమ్ముతున్నారు అని తెలిపారు.

దాదాపు యూకే లో నివసిస్తున్న భారతీయులంతా బిఆర్ఎస్ లో చేరి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని అశోక్ చెప్పారు.భారతదేశం నుంచి బీఆర్ ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శి సత్య చిలుముల, కార్యదర్శులు హరి గౌడు నవాబుపేట్ సత్యా చిలుముల, శ్రీకాంత్ జే, కోశాధికారి సతీష్ గొట్టేముక్కల, అధికార ప్రతినిధులు రవి ప్రదీప్ పులుసు, రవి ప్రియతనేని, లండన్ ఇన్చార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృథ్వి రావుల, మధు యాదవ్ ఇంకా ఎంతోమంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube