ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ అయిన వైసీపీ 2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని ఫలితాలను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.151 అసెంబ్లీ స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో ఊహించని స్థాయిలో విజయం వైసీపీ సొంతం కాగా సీఎం జగన్ లైఫ్ లోని ముఖ్యాంశాలతో ఒక సినిమా తెరకెక్కనుంది. వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే జగన్ జీవితంలోని ముఖ్యాంశాలకు సంబంధించిన కథతో తెరకెక్కిస్తున్న సినిమా గురించి వర్మ స్పందిస్తూ నేను తెరకెక్కిస్తున్న సినిమాలో జగన్ కు సంబంధించిన ప్రతి అంశం ఉండదని వైఎస్సార్ మృతి చెందేవరకు జగన్ ఎలా ఉన్నాడు? ఏం చేశాడు? ఎలా ఇక్కడివరకు వచ్చాడు? అనే అంశాలను మాత్రమే ప్రధానంగా చూపించనున్నామని పేర్కొన్నారు.వర్మ జగన్ జీవితంలోని ఆసక్తికర విషయాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
2014, 2019 ఎన్నికల ఫలితాల గురించి కూడా ఈ సినిమాలో చర్చించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నేను చూసిన జగన్ ను పరిచయం చేస్తానని వర్మ అన్నారు.2023 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని ఆర్జీవీ కామెంట్లు చేశారు.స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేశానని ఆయన తెలిపారు.జగన్ గురించి తెరకెక్కించే మూవీతో వర్మ ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
ఆర్జీవీ సినిమాలు హిట్ ఫ్లాప్ ఫలితంతో సంబంధం లేకుండా పబ్లిసిటీ ద్వారా వార్తల్లో నిలుస్తాయి.ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వర్మ తెరకెక్కించే ఈ సినిమా వైసీపీకి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.ఆర్జీవీ చేసిన కామెంట్ల వల్ల ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.