Savitri SVR: తెలుగు జాతి ఈ ఇద్దరికి ఇంత అన్యాయం చేస్తున్నారా ?

తెలుగు సినిమా రంగం పుట్టి వంద సంవత్సరాలకు కూతవేటు దూరంలో ఉంది.ఇన్నేళ్ల సినీ చరిత్రలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాల మంది వస్తూనే ఉన్నారు అలాగే పోతూనే ఉన్నారు.

 Why Government Neglected Svr And Savitri Details, Savitri, Svr, Mahanati Savitri-TeluguStop.com

కానీ ఇండస్ట్రీ కి వచ్చే చాల మందికి అంతకు ముందు ఉన్నవారు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు.ఆలా ఇండస్ట్రీ లో ఉన్న 90 శాతం మంది మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని సినిమా పరిశ్రమకు వచ్చారు అని అడిగితే ఆడవాళ్ళలో అయితే మహానటి సావిత్రి గారి పేరు చెప్తారు లేదంటే మొగవాళ్లలో అయితే ఎస్ వి రంగారావు గారి పేరు చెప్తారు.

మహామహా నటులకు కూడా సాధ్యం కానీ ఎన్నో విషయాలను ఎంతో అలవోకగా చేయడంలో సావిత్రి మరియు ఎస్వీఆర్ ముందు ఉంటారు.

మరి ఇలా వందల, వేల మంది వీరిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వషున్నారు అంటే వారికి ఎంత గొప్ప పేరు మరియు గొప్ప అవార్డులు మరియు రివార్డులు దక్కి ఉండాలి.

నటన విషయానికి వస్తే వందల్లో సినిమాల్లో నటించారు.అలాగే వారు నటిస్తున్నానని రోజులు కూడా అందరు బాగా చూసుకునే వారు అలాగే చేతి నిండా డబ్బు కూడా సంపాదించారు.

జనాల అభిమానానికి అయితే లెక్కే లేదు.అయితే ఇక్కడ వరకు అంతగా బాగానే ఉంది కానీ ప్రభుత్వాలు మాత్రం వీరిని గుర్తించలేదు.ఒక పద్మ అవార్డు కూడా వీరిని వరించలేదు.ఇప్పుడు సరిగ్గా నటించడం కూడా రాని వారిని కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎన్నో అవార్డ్స్ వారిస్తుంటే ఆ ఇద్దరు మహానటులు మాత్రం ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది.

Telugu Savitri, Sv Rangarao, Tollywood-Movie

మహానటి సినిమా వచ్చే వరకు అసలు సావిత్రి గారి గొప్పతనం గురించి కేవలం వినడమే కానీ కళ్లారా చూసింది లేదు.ఇక ఎస్వీర్ గురించి అయితే ఇండస్ట్రీ దాదాపు మరిచిపోయింది.అయన జీవితం కూడా బయోపిక్ గా వస్తే అయన మందు అలవాటు మినహా అదొక అద్భుత కావ్యం అవుతుంది.ఇక సావిత్రి మరియు ఎస్వీఆర్ ఈ ఒక్క విషయంలోనే పోలిక ఉంది.

మద్యం మత్తులో ఇద్దరు కూడా చివరి జీవితం గడిపారు.సావిత్రి అయితే జీవితాన్ని కూడా కోల్పోయింది.

ఈ ఇద్దరికి నటన దేవుడు ఇచ్చిన వరం, అయితే వారి నటనకు ఒక్క రివార్డ్ దక్కకపోవడం నిజంగా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube