టాలీవుడ్ లో పండుగల సమయంలో వరుస సినిమాలను రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది.పండుగ సీజన్స్ లో మెప్పించాలి అని స్టార్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.ఇక రానున్నది అంతా కూడా సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి.2023 సంక్రాంతి సీజన్ లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండడంతో కొంత మంది ఫిబ్రవరికి వెళ్లిపోతుంటే.
మరి కొంతమంది మాత్రం ఈ డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరి క్రిస్మస్ 2022 సీజన్ లో రాబోయే సినిమాల్లో మాస్ రాజా రవితేజ కూడా ఉన్నారు.
రవితేజ నటించిన ధమాకా సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతుంది.డిసెంబర్ 23న రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది.వరుస డిజాస్టర్స్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో విజయం కోసం రవితేజ ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది.పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇదే రోజున మరో సినిమా కూడా రాబోతుంది.డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస.తేజ వరుస ప్లాప్స్ తో రేసులో వెనుకంజలో ఉన్నాడు.అయినా కూడా ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సురేష్ బాబు తనయుడు రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది.అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.అయితే ఈ సినిమాను డిసెంబర్ 23నే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
అదే రోజు రవితేజ కూడా రాబోతున్నాడు.రవితేజ సినిమా ఉన్న ఓఎపింగ్స్ మాత్రం బాగా వస్తాయి.
మరి అలాంటి మాస్ రాజాతో తేజ తట్టుకోవడం కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.చూడాలి ఈ పోటీ నుండి తప్పుకుంటాడో లేదా అలాగే కంటిన్యూ అవుతారో.