విమాన ప్రయాణం చేసే అయ్యప్ప స్వాములకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుభవార్త చెప్పింది.ఇకపై అయ్యప్పలు ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకు వెళ్లేందుకు బీసీఏఎస్ అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు అయ్యప్పలకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.తనిఖీల తర్వాత ఇరుముడిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు విమానాశ్రయాల సెక్యూరిటీ సిబ్బంది బీసీఏఎస్ మార్గదర్శకాలు జారీ చేసింది.జనవరి 20 వరకు విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తుంది.
మండలంతో పాటు మకర జ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు అవకాశం ఇస్తున్నట్లు బీసీఏఎస్ వెల్లడించింది.