టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గత కొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.యాక్షన్ హీరో అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వివాదాలకు కారణమైంది.
అయితే ఈ వివాదం అనంతరం తాజాగా విశ్వక్ స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం దాస్ కా దమ్కీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ కార్యక్రమాన్ని ఏ ఎం బి సినిమాస్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖి అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి నటసింహం బాలకృష్ణ మాట్లాడుతూ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వక్ గురించి కూడా బాలయ్య పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.ఈయనకు సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ఇలాంటి సినిమాలు చేస్తే నన్ను నేను ఊహించుకుంటానని ఈయన తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పనులను ప్రారంభం చేసుకోనుంది.ఈ సినిమా ఆదిత్య 999 టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.