Fish Benefits : చేపలు తినడం వల్ల ఎదిగే పిల్లలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

మనం చిన్నపిల్లలకు తరచూ ఏ ఆహారం పెడితే వాళ్ళ పెరుగుదల,ఆరోగ్యం బాగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం.అయితే చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకు ఇలాంటి ఆహారం తినిపించాలి అని సలహా ఇస్తూ ఉంటారు.

 Health Benefits Of Eating Fish,fish,children,omega Fatty Acids,zinc,fish Benefit-TeluguStop.com

అటువంటి వాటిలో చేపలు కూడా ఒకటి.అయితే ఎదిగే పిల్లలకు చేపలు తినిపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఎందుకంటే ఎదిగే పిల్లలకు మంచి ఆహారం, ప్రోటీన్స్, విటమిన్స్ అవసరం ఉంటుంది.ఇలా ఇవన్నీ లభించే పదార్థాలు పిల్లలు తినడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది.

అందుకే విటమిన్లు, క్యాల్షియం ఇలా ఇవన్నీ దొరుకుతాయని ఎదిగే పిల్లలకు పాలు, పండ్లు తినిపిస్తూ ఉంటారు.అదేవిధంగా ఇలా ఎదిగే పిల్లలకు పాలు పండ్లతో పాటు చేపలు తినిపించడం కూడా చాలా మంచిది.

ఎందుకంటే చేపలలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.ఇంకా వీటిని తినడం వల్ల చాలా ఖనిజాలు మన శరీరానికి అందుతాయి.

ఎందుకంటే చేపలలో ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్, డి బి2 ఉంటుంది.

Telugu Fish, Fish Benefits, Fish Oil, Benefits Fish, Tips, Healthy, Zinc-Telugu

ఇలా చేపల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అదేవిధంగా బరువు పెరుగుతున్న వాళ్లకు కూడా ఫిష్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది అంటున్నారు మన వైద్య నిపుణులు.ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లు లేదా ఊబకాయం ఉన్నవాళ్లు చేపలు తింటే చాలా మేలు జరుగుతుంది.

దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, కొవ్వు తగ్గి మనిషి బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఎండిన చేపలలో మరింత ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది.

ఎందుకంటే ఎండు చేపలు తక్కువగా కేలరీలను అందిస్తాయి.అందువలన దీనివల్ల బరువు పెరగరు.

అలాగే ఎండు చేపల్లో అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, క్యాల్షియం కూడా ఉంటుంది.అందుకే ఎదిగే పిల్లలకు కనీసం వారానికి ఒక రోజైనా లేదా 15 రోజులకు ఒకసారి అయినా చేపలు తినిపించడం చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube