Harika Eknadh Paruchuri: బుల్లితెర నటుడు బర్త్ డే.. అది గిఫ్ట్ గా ఇచ్చిన భార్య.. నెటిజన్స్ షాక్?

తెలుగు బుల్లీతెర ప్రేక్షకులకు బుల్లితెర జంట ఏక్ నాధ్, హారిక ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆన్ స్క్రీన్ పై మంచి పేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైన విషయం తెలిసిందే.

 Tv Actress Harika Gift Iphone Husband Eknadh Paruchuri Details, Jaya Harika, Ekn-TeluguStop.com

కాగా ఈ జంట అల్లరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు పాల్గొన్న విషయం తెలిసిందే.

హారిక చెల్లెలి కాపురం లాంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఏక్ నాథ్ ప్రస్తుతం కేరాఫ్ అనసూయ లాంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎవరికి వారు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట.

ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు ఏక్ నాధ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్త పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది హారిక. ఈ క్రమంలోనే అరకులోని ఒక రిసార్ట్ లో అర్ధరాత్రి ఏక్ నాధ్ తో కలిసి కేక్ కట్ చేయించింది.

అనంతరం తన భర్త కోసం కొత్తబట్టలతో పాటుగా ఒక ఖరీదైన బహుమతిని ఇవ్వడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఆ ఖరీదైన బహుమతి మరేంటో కాదు ఐఫోన్ 14 ప్రో మాక్స్.

ఆ ఐఫోన్ ఖరీదు దాదాపు లక్షన్నర కు పై మాటే.అంత ఖరీదైన కానుకను చూసి ఏక్ నాథ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

భార్య ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ గిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చాడు ఏక్ నాధ్ అయితే వీరిద్దరూ ఒక సీరియల్స్ లో కలిసిన నటించడంతో వారి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లి 2020 లో వైవాహిక బంధంతో ఒకటయ్యారు.

Telugu Gift, Eknadh, Harikaeknadh, Iphone, Iphone Pro, Jaya Harika-Movie

ఇద్దరు కలిసి ఇస్మార్ట్ జోడి షోలో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే.ఏక్ నాథ్ సైలెంట్ అయినప్పటికీ హారిక మాత్రం ఎప్పుడూ అల్లరి అల్లరి చేస్తూ చలాకీగా ఉంటుంది.కాగా హారిక సీరియల్స్ లో ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటుంది.

హారిక మొదట నేను శైలజ సీరియల్ లో నటించి మెప్పించింది.అంతేకాకుండా హారిక,ఏక్ నాధ్ ల ప్రేమ వ్యవహారం నేను శైలజ సీరియల్ ద్వారానే మొదలైంది.

ఇకపోతే తన భర్త పుట్టినరోజు సందర్భంగా హారిక ఇచ్చిన గిఫ్ట్ ను చూసిన షాక్ అవుతున్నారు.అంత ఖరీదైన గిఫ్ట్ ను ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube