Bigg Boss6 Telugu : బాలాదిత్య గీతూ.. ఇద్దరిలో ఉన్నా పెద్ద తేడా అదే!

బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం 10వ వారం పూర్తికా వచ్చింది.ఈ క్రమంలోనే పదవ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం బిగ్ బాస్ ఇంటి నుంచి బాలాదిత్యను బయటికి పంపించారు.

 Difference Between Baladitya And Geetu Royal, Baladitya ,geetu,bigg Boss6,adi Re-TeluguStop.com

ఇక నామినేషన్ లో ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్లలో శనివారం బాలాదిత్య బయటకు వెళ్లిపోవడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.ఇకపోతే తొమ్మిదవ వారంలో భాగంగా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎలాంటి రభస చేసిందో మనకు తెలిసింది.

తాను బిగ్ బాస్ నుంచి వెళ్లనని తనను బయటకు పంపించకండి అంటూ ఎంతో ఎమోషనల్ అయింది.

ఇక బాలాదిత్య మాత్రం తన ఎలిమినేషన్ ను ఎంతో పాజిటివ్ గా తీసుకొని ఎంతో హుందాగా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

తాను బయటకు వచ్చే సమయంలో ఏ మాత్రం ఎమోషనల్ కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ పలకరించి వారికి ధైర్యం చెప్పి పాజిటివ్ మైండ్ తో బయటకు వచ్చారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇద్దరికీ ఎంతో వ్యతిరేకత ఉండేది అయితే వీరిద్దరూ ఎలిమినేట్ అయినప్పుడు ఇద్దరి మధ్య కూడా తేడా స్పష్టంగా కనిపించింది అని చెప్పాలి.

Telugu Adi Reddy, Baladitya, Bigg Boss, Geetu-Movie

అయితే బిగ్ బాస్ టైటిల్ గెల్చుకోవడానికి బాలాదిత్య అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈయన ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్పడంతో చాలామందికి అది సోదిగా భావించి అతను బయటికి వచ్చారని తెలుస్తుంది.ఇక బాలాదిత్య ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆయన వెల్ మెచ్యూర్డ్ అంటూ కంటెస్టెంట్ ఆదిరెడ్డి చెప్పడమే కాకుండా హోస్ట్ నాగార్జున సైతం ఈ సీజన్లో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో బాలాదిత్య మెచ్యూర్ మైండెడ్ అంటూ కితాబ్ ఇచ్చారు.గీతూ మాత్రం కేవలం ఆటపై ఫోకస్ చేసి గేమర్ గా బయటకు వచ్చారు.ఈ క్రమంలోనే వీరిద్దరి ఎలిమినేషన్ ను పోలుస్తూ వీరిద్దరికీ ఉన్న తేడాని అభిమానులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube