టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు అగ్ర హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన విక్టరీ వెంకటేష్ కామెడీని సైతం పండించి నేర్చుకులను కడుపుబ్బనవిస్తూ ఉంటాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు.
ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విక్టరీ వెంకటేష్ కు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే విక్టరీ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా అంటే ప్రస్తుతం సినీ వర్గాలలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం మన వెంకీ మామ చేతిలో ఏ సినిమాలు లేవు.
అంతేకాకుండా ఎప్పుడూ కుర్ర హీరోలకు పోటీగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉండే వెంకీ మామ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.అయితే అవకాశాలు లేక కాదు అలా అని కథలు నచ్చక కాదు కొద్ది రోజులు వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మన వెంకీ మామకు ఆధ్యాత్మికత ఎక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ చూపి వెంకీ మామ ఆధ్యాత్మికతలో మునిగితేల నున్నాడట.ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ అభిమానులు రేపు నెల అనగా డిసెంబర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటనలు ఏమైనా చేస్తాడేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ ఇటువంటి సమయంలో ఇలాంటి వార్త వినిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.







