కొన్ని సార్లు సినిమాలో ప్రధాన పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో సహాయక పాత్రలకు సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది.చేసేవి కొన్ని సీన్స్ అయినా కూడా అవి సినిమాకు ఏంటో దోహదపడతాయి.
ఆలా తనదైన నటనతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా 70, 80 వ దశకాల్లో అద్భుతంగా నటించిన నటీమణి తాతినేని రాజేశ్వరి.కోందండరామి రెడ్డి దర్శకత్వం లో వచ్చిన సినిమా మొరటోడు నా మొగుడు.
ఈ చిత్రంలో రాజశేఖర్, మీనా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో భానుమతి కి కూతురి గా నటించింది రాజేశ్వరి.అందులో భానుమతి కి కూతురిగా రాజేశ్వరి ఆమె కూతురిగా మీనా నటన అద్భుతం.
ఇక ఆమె 1977 యమగోల సినిమా ద్వారా సినిమా ప్రయాణం మొదలు పెట్టింది.ఆమె చివరగా నటించిన సినిమా 1998 లో పెళ్లి పీటలు.20 ఏళ్ళ పాటు సాగిన రాజేశ్వరి సినీ ప్రయాణం లో చాల పాత్రలు పోషించింది.ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు.2000 సంవత్సరం తర్వాత ఆమె లేని లోటును తెలంగాణ శకుంతల భర్తీ చేసింది.నర్రా వెంకటేశ్వరరావు, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్ వంటి వారికి అనేక సినిమాల్లో పెయిర్ గా నటించింది తాతినేని రాజేశ్వరి.
ఇక ఆమె సినిమాల్లో పెద్ద రోల్స్ అయితేనే చేస్తాను అని ఏనాడు అనుకోలేదు.చలిచీమల వంటి సినిమాలో కేవలం రెండు సీన్లలో మతమే నటించిన ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.
ఇక కర్తవ్యం సినిమాలో విజయశాంతికి సవతి తల్లిగా ఆమె చూపించిన గయ్యాళి తనం ఒకప్పటి సూర్యకాంతాన్ని తలపించింది అంటే అతిశయోక్తి లేదు.
ఇక 1994 లో అమ్మాయి కాపురం లో సైతం గయ్యాళి అత్తగా నటించి ఆమె గయ్యాళి పాత్రలకు ఒక బ్రాండ్ గా మారారు.నిజానికి ఆమె ఆహార్యం కన్నా కూడా ఆమె గాత్రంతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది.విభిన్నమైన గాంభీర్యంతో ఉండే ఆమె గొంతును ఎవరు ఇమిటేట్ చేయలేరు.
ఇక అమ్మోరు సినిమాలో వడి వక్కారసి పాత్ర కోసం ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మారారు.
అయితే అంత పవర్ ఫుల్ ఫోర్స్ తో నటించిన మంచి గాత్రం ఉన్న ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనేది చాల బాధాకరం.ఇక ఆమె తెలుగు లో బుల్లి తెర పై కూడా సందడి చేసారు.అంతరంగాలు , సంధ్య సీరియల్స్ లో నటించగా, ఆమె పాత్రకు అంతరంగాలు సీరియల్ లో మంచి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లభించడం లేదు.