కోతకు గురైన ఉప్పాడ సముద్ర తీరం.. !

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురైంది.తీరం కోతకు గురి కావడంతో ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్ కుంగింది.

 Uppada Sea Coast Which Has Been Eroded.. !-TeluguStop.com

గతంలో రక్షణగా వేసిన జియో ట్యూబ్ సైతం పూర్తిగా ధ్వంసం అయింది.దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సముద్ర అలలు భారీగా ఎగిసిపడటంతో ఉప్పాడ గ్రామం కడలిలోకి కొట్టుకుపోతుంది.

ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులకు పైగా కోతకు గురైన విషయం తెలిసిందే.వందేళ్లలో సుమారు 320 ఎకరాలు కోతకు గురైందని అంచనా.

తీరం నుంచి సముద్రం చొచ్చుకుని వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube