కోతకు గురైన ఉప్పాడ సముద్ర తీరం.. !
TeluguStop.com
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురైంది.తీరం కోతకు గురి కావడంతో ఉప్పాడ - కాకినాడ బీచ్ రోడ్ కుంగింది.
గతంలో రక్షణగా వేసిన జియో ట్యూబ్ సైతం పూర్తిగా ధ్వంసం అయింది.దీంతో బీచ్ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సముద్ర అలలు భారీగా ఎగిసిపడటంతో ఉప్పాడ గ్రామం కడలిలోకి కొట్టుకుపోతుంది.
ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులకు పైగా కోతకు గురైన విషయం తెలిసిందే.
వందేళ్లలో సుమారు 320 ఎకరాలు కోతకు గురైందని అంచనా.తీరం నుంచి సముద్రం చొచ్చుకుని వస్తుంది.
ఈ ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. రికార్డ్ క్రియేట్ చేస్తారా?