తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై లేఖ రాశారు.కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు అంశాన్ని లేఖలో పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్ కు వచ్చి బిల్లుపై చర్చించాలని గవర్నర్ సూచించారు.ఈ మేరకు ప్రభుత్వంతో పాటు యూజీసీ ఆమె లేఖ రాశారు.
మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.ఎనిమిది సంవత్సరాలుగా అధ్యాపక ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని గవర్నర్ లేఖలో ప్రశ్నించారు.
కొత్త విధానంతో ఖాళీల భర్తీ ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.