Kalyan Ram Amigos : కళ్యాణ్ రామ్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తికరంగా పోస్టర్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ సినిమాలు తక్కువ అనే చెప్పాలి.ఈయన తన కెరీర్ మొత్తం చూసుకుంటే ఒకటి రెండు మినహా మిగతావన్నీ డిజాస్టర్ సినిమాలే.

 Kalyan Ram Next Film Titled Amigos Release Date Fixed, Nandamuri Kalyan Ram, Kal-TeluguStop.com

అందుకే ఈయన కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దం కాలం అవుతున్న ఇప్పటికి స్టార్ హీరోగా ఎదగలేక పోయాడు.ఒకవైపు తన తమ్ముడు వరుస హిట్స్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోతే ఈయన మాత్రం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు.

అయితే ఇది మొన్నటి వరకు జరిగిన కథ.ఇక ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.వసిష్ఠ మల్లిడి తెరకెక్కించిన ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎప్పటి నుండో ఉన్న కల తీరిపోయింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేస్తున్నాడు.ఇది కాకుండా ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అందులో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.గత ఏడాది లోనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాకు ‘అమిగోస్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

Telugu Amigos, Bimbisara, Kalyan Ram, Nandamurikalyan, Tollywood-Movie

ఈ సినిమాను రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా షూట్ ఇటీవలే పూర్తి అవ్వడంతో ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఆసక్తిని కలిగించేలా ఉంది.ఒకేలా కనిపించే వ్యక్తిని కలవడం వల్ల జరిగే పరిణామాలపై ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్ లోనే ప్రకటించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 2023న రిలీజ్ చేయనున్నారట.ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది.

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపు కుంటున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube